Wednesday, March 12, 2025
Homeఆంధ్రప్రదేశ్విజయవాడ భవానీపురం పీఎస్ కు పోసాని తరలింపు

విజయవాడ భవానీపురం పీఎస్ కు పోసాని తరలింపు

చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీలో 17 వరకు కేసులు నమోదయ్యాయి. ఆయన ఏ రోజు ఏ పీఎస్ లో ఉంటాడో, ఎప్పుడు ఏ కోర్టుకు హాజరవుతాడో, ఏ రోజు ఏ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటాడో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా, పోసాని కృష్ణమురళిని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయనను పీటీ వారెంట్ పై విజయవాడ తీసుకువస్తున్నారు. ఇవాళ ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. కోర్టు రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు… రిమాండ్ విధించకపోతే మళ్లీ కర్నూలు జిల్లా జైలుకు తరలించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు