Saturday, May 3, 2025
Homeజిల్లాలునెల్లూరుమాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి జయంతి పోస్టర్ ఆవిష్కరణ

మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి జయంతి పోస్టర్ ఆవిష్కరణ

భక్తులు అందుతున్న వసతులపై అధికారులతో సమీక్ష

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు..
ముందుగా ఆలయ వేద పండితులు, అధికారులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కి వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈనెల 17వ తేదీన జరగనున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి జయంతి పోస్టర్ ను ఆలయ ఈవో.. మరియు అధికారులు తో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.కందుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో 1982వ 10వ తరగతి బ్యాచ్ మిత్రులు చెందిన అందజేసిన మంచినీటి శీతలీకరణ మంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.అనంతరం భక్తులు స్వామివారికి తలనీలాలు ఇచ్చే ప్రాంతాన్ని, అన్నదానప్రసాద కేంద్రాన్ని సందర్శించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఎమ్మెల్యే గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు మరియు ఇతర ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు ఎమ్మెల్యే ఆదేశించారు.అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి పరిశీలించి ఎమ్మెల్యే గారు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలోఉపకమీషనర్,ఆలయ కార్యనిర్వాహనాధికారి సాగర్ బాబు, గుడ్లూరుసీఐ మంగారావు,కందుకూరు రూరల్ ఎస్ఐ బాలు మహేంద్ర నాయక్,వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు మన్నం కృష్ణ, వడ్డెళ్ళ రవిచంద్ర, కూనం నరేంద్ర, తలతోటి మస్తాన్ మరియు 1982 జిల్లా పరిషత్ బాలుర పాఠశాల 10 తరగతి బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు