విశాలాంధ్ర ధర్మవరం ;పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 09న నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సభ పోస్టర్‌ను ఆదివారం నాడు ధర్మవరం లో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ విడుదల చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు మాట్లాడుతూ, సెప్టెంబర్ 09న ధర్మవరం పట్టణంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సభకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.బీఎస్పీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో బీఎస్పీ అధికారిక ఏనుగు గుర్తుపై పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.తుంపార్తి కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యేకు, మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు కనిపించడం లేదా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? ప్రజలకు సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు.కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.“ఎమ్మెల్యే, మంత్రి తుంపార్తి కాలనీకి వచ్చి ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించి, ఏ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో స్పష్టమైన గడువు ప్రకటించాలి. ఇక హామీలు కాదు.. పనులు కావాలి” అని సాకే వినయ్ కుమార్ అన్నారు.మున్సిపల్ సమస్యల పరిష్కారంపై మంత్రి పొంగూరు నారాయణ, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులపై మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టాలని బీఎస్పీ డిమాండ్ చేసింది.“ధర్మవరం అభివృద్ధి కాగితాల్లో కాదు.. ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో కనిపించాలి అని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు బీఎస్పీ ప్రశ్నిస్తూనే ఉంటుంది” అని సాకే వినయ్ కుమార్ స్పష్టం చేశారు.సెప్టెంబర్ 09న జరిగే సన్నాహక సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో బీఎస్పీ డివిజన్ అధ్యక్షులు నారాయణస్వామి, నాయకులు హరి ప్రసాద్, సాకే హరి కుమార్, లక్ష్మణ్ణ, ఆనంద్, జుబేర్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్మవరం పట్టణంలో బీఎస్పీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సభ పోస్టర్ విడుదల.. సాకే వినయ్ కుమార్
- Advertisement -
RELATED ARTICLES


