Homeఆంధ్రప్రదేశ్ఉరవకొండ గవి మఠం బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల

ఉరవకొండ గవి మఠం బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల

- Advertisement -

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని గవిమఠం దేవస్థానం చంద్రమౌళీశ్వర స్వామి వారి మహా రథోత్సవ ఆహ్వాన పత్రికలు మరియు పోస్టర్లను శనివారం గవి మఠం దేవస్థానం ఆవరణలో మఠం పీఠాధిపతి చెన్న బసవ రాజేంద్ర మహా స్వాములు, ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర మహా స్వాములు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అయితే ప్రధాన కార్యక్రమాలు 26న మహా రథోత్సవం 27 న లంకా దహనం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరుగుతాయని ఆయన తెలిపారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఉత్సవాలు ఏపీతో పాటు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారని తెలిపారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని తెలిపారు. రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి
ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలను చేపట్టాలని కూటమి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీల నాయకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు