Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగర్భిణీలు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి..

గర్భిణీలు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి..

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం:: గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారముతో పాటు, చక్కటి ఆరోగ్యాన్ని కూడా తప్పక పొందాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ నాయక్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎల్సీకే పురములో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విరాళాన్ని అందించిన వారు చిన్న తంబి చిన్నప్ప కు కమిటీ బృందం, ఆసుపత్రి సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల పట్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తోడుగా ఉంటూ, తగిన జాగ్రత్తలను తీసుకుంటూ, నెలవారి వైద్య చికిత్సలతో పాటు టీకాలు కూడా వేయించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందేలా చూడాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలు ఎటువంటి టెన్షన్లకు గురికారాదని తెలిపారు. టీకాలు, వైద్య చికిత్సల విషయంలో నిర్లక్ష్యం ఉండరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేణుగోపాల్, కార్యదర్శి మంజునాథ్, కోశాధికారి చంద్రశేఖర్, సంస్థ సభ్యులతో పాటు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు