మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి
విశాలాంధ్ర ధర్మవరం; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధను కనపరచాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల గర్భిణీ స్త్రీలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని వైద్యులు సిస్టర్ల చైతన్ మీదుగా పంపిణీ చేశారు. అనంతరం చిన్న తంబి చిన్నప్ప, డాక్టర్ గౌతమి మాట్లాడుతూ కుటుంబంలో గర్భిణీలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా వారి ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధను చూపించాలని తెలిపారు. నెలవారి పరీక్షలు, ఇంజక్షన్లు, వైద్య చికిత్సలు ఎప్పటికప్పుడు చేసుకోవాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధను ఘనపరిచినచో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారంతో పాటు ఎటువంటి టెన్షన్లు లేకుండా ప్రసవం అయ్యేంతవరకు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేణుగోపాల్, కార్యదర్శి మంజునాథ్, సభ్యులు వెంకటేష్, నాగరాజు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధను కనపరచాలి
RELATED ARTICLES