మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని దుర్గా నగర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారాన్ని భుజించాలని, వైద్య చికిత్సలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా గర్భిణీ స్త్రీల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతగా పట్టణంలోని లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ శంకర్ నాయుడు నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ కార్యదర్శి మంజునాథ్ కోశాధికారి చంద్రశేఖర్, సభ్యులు సాయి ప్రసాద్, జగ్గా నాగరాజు, రమేష్ ,రాజు ప్రకాష్, ఏ నేమ్ లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
గర్భిణీలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
RELATED ARTICLES