Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్రపతికి చేనేత కళాకారుల ప్రతిభను తెలిపిన డిజైనర్ నాగరాజ్

రాష్ట్రపతికి చేనేత కళాకారుల ప్రతిభను తెలిపిన డిజైనర్ నాగరాజ్

విశాలాంధ్ర ధర్మవరం:: దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఆహ్వానం మేరకు వివిధ త కా అమృత్ మహోత్సవ అనే కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కళాకారుల డిజైనర్ జుజారు నాగరాజ్ చేనేత కళాకారుల యొక్క ప్రతిభను తెలియజేస్తూ పట్టు చీరలపై రాష్ట్రపతి ద్రౌపతి మురుమ్మ్ ముఖచిత్రంతో కూడిన పట్టు శాలువాను ధర్మవరం చేనేత కళాకారుల తరఫున బహుమతిగా వారికి అందజేశారు. తదుపరి రాష్ట్రపతి కు, గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చేనేత కార్మికుల నైపుణ్యము, వారి ఆర్థిక స్థితిగతుల గూర్చి వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం ధర్మవరం చేనేత కార్మికులు తయారుచేసిన పట్టుచీరలు, పట్టు పావడాలను చూపుతూ తయారీ గూర్చి కూడా తెలియజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజైనర్ నాగరాజ్ తో పాటు చిప్పల మార్కండేయ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు