నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణ లో ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, పియూష్ గోయల్, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అంబేడ్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు ఇవాళ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
అంబేడ్కర్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
RELATED ARTICLES