డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ సెల్వియా సల్మాన్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియాను సంబంధిత అధికారులు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సాల్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణములో మాత్రమే ఫ్లెక్సీ పట్టుకుని ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకున్నారు. సంబంధిత మలేరియా అధికారి జయరాం నాయక్ కూడా ఇందులో పాల్గొని కనీసం ప్రజలకు ర్యాలీ ద్వారా జరపాల్సిన ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి బత్తలపల్లికి వెళ్లిపోయారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్ ఏఎన్ఎం లకు ఆశా కార్యకర్తలకు ప్రపంచ మలేరియా దినోత్సవం గూర్చి వివరించారు. అనంతరం గ్రామాలలో పట్టణాలలో మలేరియా వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.