విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన పూజారి రామాంజనేయులు హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందగా, తన కళ్ళను నేత్రదానం చేసి, మానవతను చాటుకున్నారు. ఇందులో భాగంగా పూజారి రామాంజనేయులకు గుండెపోటు రావడం, మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తో సంప్రదించి నేత్రదానానికి అంగీకారం తెచ్చుకున్నారు. తదుపరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రా వైల్ సెంటర్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్, డైరెక్టర్ ఆపిల్ ఐ కేర్ ఆస్పత్రి డాక్టర్ జగన్మోహన్, రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు, మోహన్ కృష్ణ, ఆలంబన జనార్ధన్, టెక్నీషియన్ రాఘవేంద్ర, విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోలమరం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నేత్రదానాలను స్వీకరించడం జరిగింది. నేత్రదానమునకు సహకరించిన కీర్తిశేషులు పూజారి రామాంజనేయులు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలను తెలుపుతూ వారిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సంఘం అధ్యక్షులు గాజుల సురేష్, సభ్యులు సుబ్రహ్మణ్యం , జుజారు రఘు, చంద్రశేఖర్ ,ప్రభాకర్ రెడ్డి, మాధవ, వెంకటేష్ ,నారాయణస్వామి, ధనుంజయ తదితర సభ్యులు పాల్గొన్నారు.
పూజారి రామాంజనేయులు నేత్రదానం
RELATED ARTICLES