ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పోతుకుంట రోడ్డు ప్రియదర్శిని విద్యా మందిర్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విజయదుందుభి మోగించడం జరిగిందని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ చెన్నారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 31 మంది పరీక్షలు రాయగా 30 మంది ఉత్తీర్ణత చెందడం జరిగిందని తెలిపారు. ఇందులో 500 మార్కులు పైగా 17 మందివిద్యార్థులు , 580 మార్కులు నలుగురు తేవడం జరిగిందన్నారు.. ఇందులో తరగు శ్రావణి 596 మార్కులతో అగ్రస్థానంలో ఉండడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధమ శ్రేణిలో 60 శాతం లో 26 మంది, ద్వితీయ శ్రేణిలో 50 శాతం లో ముగ్గురు ప్రతిభ కనపరచడం జరిగిందన్నారు. తదుపరి విద్యార్థులందరికీ ఉత్తీర్ణత సాధించడం పట్ల హెడ్మాస్టర్, డైరెక్టర్, ఉపాధ్యాయులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రియదర్శని విద్యా మందిర్ 10వ తరగతి పరీక్షల్లో విజయ దుందుభి..
RELATED ARTICLES