డిఆర్ఓ ఏ. మాలోల కు
- ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ వినతులు
- విశాలాంధ్ర -అనంతపురం : మధ్యాహ్న భోజనం,ఆశా,అంగన్వాడీ,స్కూల్ ఆయాలుడవాచ్మెన్ల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు,
దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో అనంతపురము కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ఏ. మాలోల కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… స్కీం వర్కర్లుగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం,ఆశా,అంగన్వాడీ,స్కూల్ ఆయాలుడవాచ్మెన్లు చాలీ చాలని వేతనాలతో కుటుంబ పోషణకు ఇబ్బందిగా మారిందన్నారు,ఉద్యోగ భద్రత లేక స్కీం కార్మికులను ఇస్టానుసారంగా తొలగించారన్నారు,మధ్యాహ్న భోజన కార్మికులకు 10 వేలు వేతనం ఇవ్వాలన్నారు,ధరలకు అనుగుణంగా 30 రుపాయలు ప్రతి విద్యార్థికి మెస్ చార్జీలు ఇవ్వాలన్నారు,బకాయి ఉన్న బిల్లులు వెంటనే ఇవ్వాలన్నారు,ఆశా కార్మికులకు కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలన్నారు,ఆశా కార్మికులకు ఏ ఎన్ ఎం లుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు,ఆశాలకు వేతనాలతో కూడిన సాధారణ,మెటర్నిటీ సెలవులు ఇవ్వాలన్నారు,మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా గుర్తించాలన్నారు,తెలంగాణ తరహాలో 18 వేలు వేతనం అమలుచేయాలన్నారు. స్కూల్ ఆయాలు డ వాచ్మెన్లకు 108 జిఓ ప్రకారం 11,500 రుపాయలు వేతనాలు ఇవ్వాలన్నారు. స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి,అంతవరకూ 26 వేలు వేతనం ఇవ్వాలన్నారు. ఈపీఎఫ్ , ఈఎస్ఐ ,గ్రాట్యూటీ వెంటనే అమలు చేయాలన్నారు,
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,నగర అధ్యక్షులు చిరంజీవి, మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ సి ఎం భాష,జిల్లా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న,నాయకులు మురళి, మునిస్వామి, ప్రభుత్వ స్కూల్స్ ఆయాలుడవాచ్మెన్ యూనియన్ నాయకులు బాషా,రాములమ్మ,దేవి తదితరులు పాల్గొనడం జరిగింది.