Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించండి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించండి

ప్రతి ఉపాధి కూలీకి రోజుకి రూ. 700 చెల్లిస్తూ 200 రోజులు పనిదినాలు కల్పించాలి…
ఈనెల 22,23 తేదీల్లో బండ్లపల్లి నుండి అనంతపురం వరకు పాదయాత్ర జయప్రదం చేయండి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ పిలుపు
విశాలాంధ్ర అనంతపురం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని, ప్రతి ఉపాధి కూలీకి రోజుకి రూ. 700 చెల్లిస్తూ 200 రోజులు పనిదినాలు కల్పించాలని డిమాండ్ తో ఈనెల 22,23 తేదీల్లో బండ్లపల్లి నుండి అనంతపురం వరకు తలపెట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి సీ జాఫర్ సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ…. 2005 లో యూపీఏ కేంద్ర ప్రభుత్వం వామపక్ష పార్టీల మద్దతుతో వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు దీర్ఘకాలిక ఆందోళనా పోరాటాల ఫలితంగా గ్రామీణ పేదకష్టజీవులు పనులు లేక వలసలు,ఆకలిచావులు నివారించేందుకు సంవత్సరంలో 100 రోజులు పనులు గ్యారంటీ కల్పించే లక్ష్యంతో పార్లమెంట్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేయబడి పథకంగా రూపొందించబడి 2006,ఫిబ్రవరి 2 వ తేదీన అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, స్వర్గీయ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామీణ పేదలకు ఓ వరంగా భావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి గ్రామీణ పేదలలో మాలాంటి సంఘాలు విస్తృత ప్రచారం చేయడం జరిగిందన్నారు. ఫలితంగా ఈ పథకాన్ని ఉపయోగించుకొని పేదలు తమ జీవితాలలో కొంతమేరకు ఆర్థిక వెసులుబాటు కల్పించుకుంటున్నారన్నారు .ఈ చట్టం అమలులో గ్రామీణ పేదల సంఘాలు అప్రమత్తమై ఆచరణ సాధ్యం కాని నిబంధనలు, అరకొర బడ్జెట్ కేటాయింపులు, నీరుగార్చే విధానాలకు వ్యతిరేకంగా, చట్టం రక్షణకు నేటికీ పోరాడుతోందన్నారు. అందులో భాగంగా ఈనెల 22, 23 తేదీలలో బండ్లపల్లి నుండి అనంతపూర్ వరకు పాదయాత్ర అనంతరం స్థానిక టవర్ క్లాక్ వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చట్టం పక్కాగా అమలు జరిగితేనే పేదలకు ఉపాధి,మరియు గ్రామీణాభివృద్ధి జరుగుతుంది.కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి బడ్జెట్ లో 4 లక్షల 60 వేల కోట్లు కేటాయించవలసి ఉండగా,యేడాదికి,యేడాది తగ్గిస్తూ ఈ యేడాది కేవలం 86 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు . అరకొర కేటాయింపులు వల్ల ఉపాధి కూలీలకు పనులు కల్పించడానికి డబ్బులు సరిపోదు అన్నారు. పనులు కల్పించకపోవడం వల్ల ఏటా వలసలు పెరుగుతున్నాయన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తో పాటు కరువు, క్షమంతో కూడిన అనంతపురం జిల్లా రైతులు ఇతర రాష్ట్రాలకు వలసలు తీవ్రమవుతున్నా,నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉరవకొండ తదితర ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలపై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఈ విషయంపై రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టర్కు నివేదిక ఇస్తున్నట్లు పేర్కొన్నారు. . కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని నిర్వీర్యం చేసి,నీరుగారుస్తూ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా, వ్యవసాయానికి అనుసంధానించాలనే దుష్ట,నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా, చట్టాన్ని రక్షించుకోవడం కోసం తమ బాధ్యతగా సిపిఐ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం కూడా యీ సంవత్సరం బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఈ మధ్యకాలంలో అనంతపూర్ జిల్లా లో పనులు లేక ప్రాంతాలకు వలస కూలీగా వెళుతున్న వారికి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారికి ఎటువంటి భద్రత లేదన్నారు. ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బి. కే.యం. యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి కేశవరెడ్డి మాట్లాడుతూ… ఉపాధి హామీ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈనెల 22,23 తేదీల్లో అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుండి అనంతపురం వరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్లు సాధన కోసం గ్రామీణ కష్ట జీవుల పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రెండు రోజులు పాటు జరిగే ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం తో పాటు రెండవ రోజు అనంతపురం పట్టణంలో టవర్ క్లాక్ దగ్గర గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, తో పాటు ఇతర రాజకీయ పార్టీల పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డిమాండ్ తో కూడిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టి రంగయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నాగరాజు ఉప ప్రధాన కార్యదర్శి డి. పెద్దయ్య జిల్లా ఉపాధ్యక్షులు పెరుగు సంగప్ప జిల్లా సహాయ కార్యదర్శి బండారు శివ నారాయణమ్మ మళ్ళా రాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు