Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించండి.. అధ్యక్షులు కిరణ్ కుమార్

మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించండి.. అధ్యక్షులు కిరణ్ కుమార్

విశాలాంధ్ర -ధర్మవరం : మీటర్ రీడర్ రీఛార్జ్ మీటర్లు వస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆయన మేము సంస్థ ను నమ్ముకుని గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న, అయితే ఈరోజు రీఛార్జ్ మీటర్లు వస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్స్ ఉపాధి కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి అని, కనుక మీటర్ రీడర్స్ అందరూ రాష్ట్రవ్యాప్తంగా మహాసభ తరువాత కార్యచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా మీటర్ రీడర్స్ కార్మికులు ఏఐటీయూసీ ధర్మవరం పట్టణం నాయకులు,ఎర్రమ శెట్టి రమణ ఆధ్వర్యంలో 18 తేదీన డి ఈ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా, అలాగే మార్చి 20 తారీకున ఎస్సీ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం, 24వ తారీఖున కలెక్టర్ వినతి పత్రం సమర్పించడం, 27వ తారీఖున సీఎండి కార్యాలయం ముందర ధర్నా. కార్యక్రమాలు నిర్వహించడంజరుగు తుంది అన్నారు. అదేవిధంగా మీటర్ రీడర్ సమస్యలు పరిష్కారం కానీ ఎడల తదుపరి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది అని తెలిపారు.
ప్రతి ఒక్కరు మీటర్ రీడర్స్ పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీటర్ రీడర్స్ యొక్క డిమాండ్లు లలో మీటర్ రీడర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి అని,మీటర్ రీడర్స్ కి కనీస వేతనం అమలు చేయాలి అని, మీటర్ రీడర్స్ కి ఎస్కో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలి అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు