మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములో ఉన్నటువంటి రెండు అన్నా క్యాంటీన్లలో పేద ప్రజలకు నాణ్యత గల భోజనమును, అల్పాహారమును తప్పక అందించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. తదుపరి అన్నా క్యాంటీన్ లో ఉన్నటువంటి పదార్థాలను వారు పరిశీలించారు. అల్పాహారం నాణ్యతగా ఉందా? లేదా? అని కూడా రుచి చూశా రు. మున్సిపల్ ఆఫీస్ ద్వారా వాటర్ సక్రమంగా పంపిణీ అవుతోందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ విషయంలో అన్నా క్యాంటీన్ సిబ్బంది శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం క్యాంటీన్లో టిఫిన్ తింటున్న వ్యక్తులతో నేరుగా మాట్లాడి, నాణ్యత ఎలా ఉంది? అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
అన్నా క్యాంటీన్ ద్వారా నాణ్యత గల భోజనమును అందించండి
RELATED ARTICLES