విజయవాడ జైలులో ఖైదీగా ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. ఆదివారం ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో విచారణ కొనసాగలేదు. ఈరోజు విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కస్టడీలోకి తీసుకున్న అధికారులు తాడిగడపలోని సీఐడీ కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు. ఇక, మూడు రోజుల పాటు (ఆది, సోమ, మంగళవారం) ఆయన్ను సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఇటీవల విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ముంబయి నటి కాదంబరి జెత్వానీపై అక్రమంగా కేసు బనాయించారనే ఆరోపణలతో పీఎస్ఆర్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు.
సీఐడీ కస్టడీకి పీఎస్ఆర్ ఆంజనేయులు
RELATED ARTICLES