Saturday, May 17, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన..

డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రపంచ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా ధర్మవరం పట్టణ ప్రజలకు ర్యాలీ రూపంలో అవగాహన ను ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహణలో డెంగ్యూ వ్యాధి -దాని నివారణ పై పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డెంగీ జ్వరం అనేది ఎడిష్ ఈజీ స్టై అను దోమ కుట్టడం వలన డెంగ్యూ, చికెన్ యూనియన్ వ్యాధులు వస్తాయని తెలిపారు. ఇటువంటి దోమలు ఇంటి పరిసరాలలోని చిన్నచిన్న నీటి నిల్వలలో అనగా తొట్టెలు, నీటి డ్ర మ్ములు, వర్షపు టైర్లు, వర్షం నీటి నిల్వ ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు లలో ఉంటాయని తెలిపారు. ఆడ అనాఫిలస్ దోమలు రోజు మార్చి రోజు 150 గుడ్లను పెడతాయని అవి పగిలి చిన్నచిన్న గా నీటిలో కనిపించే లార్వాలుగా ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ దోమల వ్యాప్తి అరికట్టడం అందరి బాధ్యత అని తెలిపారు. ఇంటి పరిసరాలు చెత్తాచెదారంతో ఉండరాదని, వర్షపు నీరు నిల్వ ఉండరాదని, మురికి నీటిలో వారానికి ఒకసారి కిరోసిన్ లేదా ఇంజన్ ఆయిల్ చెల్లాలని తెలిపారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని, దోమల బెడద నుండి రక్షణ పొందుటకు దోమతెరలు వాడాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ.. డాక్టర్ సెల్వియా సల్మాన్, డాక్టర్ చెన్నారెడ్డి, బీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ నాయక్, డాక్టర్ శ్రావణి, సబ్ యూనిట్ మలేరియా అధికారి జయరాం నాయక్ తో పాటు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ,సి ఓ డబ్లు వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు