విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న తహసీల్దార్ నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు రవి, నర్సింహులు, కృష్ణ, తిక్కమ్మ తెలిపారు. శనివారం పెద్దకడబూరులో వారు విలేకరులతో మాట్లాడుతూ పెద్దకడబూరులో సర్వేనెంబర్ 377 లో అప్పటి డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ సమక్షంలో 11/5/2023 లో పొజిషన్ పట్టా ఇవ్వడం జరిగిందన్నారు. పట్టాకు స్థలం చూపాలని ఇప్పుడున్న తహసీల్దార్ గీతా ప్రియదర్శిని దృష్టికి తీసుకెళితే చూద్దాం, చేద్దామని అంటున్నారే గానీ చేయడం లేదన్నారు.నేను మహిళా తహసీల్దార్ ను ఎక్కువ మాట్లాడితే మీపై కేసులు పెడతామని అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలు విన్నవిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం మూడు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరిగుతున్నా పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కారం అయ్యే వరకు తహశీల్దార్ కార్యాలయం ఎదుట దశలవారీగా నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై రైతులకు మద్దతుగా సిపిఐ పార్టీ అండగా ఉంటుందన్నారు.