పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలులో సిపిఎం పార్టీ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలను సిపిఎం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు భాషా, పెద్దన్న, మారుతి, రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ఆదర్శవంతమైన నాయకులలో అగ్రగామి పుచ్చలపల్లి సుందరయ్య అని, రాజకీయ విభేదాలతో నిమిత్తం లేకుండా వారిని అభిమానించేవారు, ఉన్నత విలువలు పాటించి నెహ్రూ లాంటి వారి అభిమానాన్ని సైతం చురుగున్న మహా వ్యక్తి అని అంతేకాకుండా రాజకీయంగా విభేదించే వారిని సైతం ఆయన గౌరవించే వారిని తెలిపారు. నిబద్ధత కలిగిన అసాధారణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, పోరాట విలువల్లో నుంచి సుందరయ్య లాంటి మహనీయులు రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగిందని తెలిపారు. సమాజం కోసం త్యాగం చేయడం, ప్రజల పట్ల నమ్రత, నమ్మకం, పోరాటాల పట్ల నిబద్ధత, మార్కెస్ట్ సిద్ధాంతం పట్ల అచంచల విశ్వాసము గల ఆయన వ్యక్తిత్వం రూపొందించుకోవడం జరిగిందని తెలిపారు. నేడు వారు మన ముందు లేకపోయినా వారు నిర్మించిన ఉద్యమం, చూపించిన బాట, నెలకొల్పిన విలువలు సజీవంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయూబ్ ఖాన్, ఆదినారాయణ, వెంకటస్వామి, నారాయణస్వామి, నాగవేణి తదితరులు పాల్గొన్నారు.
అత్యంత ఆదర్శవంతమైన నాయకులలో అగ్రగామి పుచ్చలపల్లి సుందరయ్య
RELATED ARTICLES