Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుంది.. ప్రిన్సిపాల్ మహాలక్ష్మి

ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుంది.. ప్రిన్సిపాల్ మహాలక్ష్మి

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రిన్సిపాల్ మహాలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపకులు మల్లికార్జున ప్రభాకర్ పెద్దన్న తదితరులు మండల పరిధిలోని పలు గ్రామాలలో, పట్టణంలోని ముఖ్యమైన కూడలిలలో వారు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మాట్లాడుతూ నైపుణ్యం, అనుభవం గల అధ్యాపకులచే విద్యా బోధన జరుపుతున్నామని, ప్రతి సంవత్సరం మంచి ఫలితాలను వస్తూ పట్టణములో ఓ మంచి గుర్తింపు కలిగిన పాఠశాలగా ఉందని వారు తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో ఫీజుల బెడద ఉంటుందని, అదే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం ద్వారా ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉత్తమమైన బోధనను బోధించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కూడా వర్తించడం జరుగుతుందని తెలిపారు. చదువుతోపాటు క్రీడలు, యోగ, ఆరోగ్యంలాంటి వాళ్ళ విషయాలను కూడా కళాశాలలో నేర్పించడం జరుగుతుందన్నారు. కావున పదవ తరగతి ఉత్తీర్ణత చెందిన విద్యార్థులను తల్లిదండ్రులు మా ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కు, ద్వితీయ సంవత్సరానికి చేర్పించాలని వారు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించడం జరుగుతుందని, తద్వారా మా కళాశాలలో బాలికల సంఖ్య పెంచేందుకు తాము కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు