Saturday, May 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి..

పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి..

నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యములతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ పాఠశాలలు విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు రావాలని, అలాగే ఫీజులు విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో పాఠశాలలు తమ వంతు పాత్ర పోషించాలని, సమాజానికి సేవ చేయడంలో భాగస్వామ్యులు కావాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు