Friday, January 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాణ్యతతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలి.. ఆర్డీవో మహేష్

నాణ్యతతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం ; నాణ్యతతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలి అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని నడిమి గడ్డిపల్లి లో గల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు హాజరు పట్టికను పరిశీలించిన తర్వాత, విద్యార్థుల హాజరు బాగున్నదా? రోజు విద్యార్థుల చదువు బోధన ఎలా ఉంది? అని ఇంచార్జ్ హెచ్ఎం. కళావతి ద్వారా ఆరా తీశారు. తదుపరి కొంతసేపు విద్యార్థులతో చదువు విషయంలో ముచ్చటిస్తూ పలు ప్రశ్నలను వేశారు. చదువుపై మరింత శ్రద్దను కనపరచాలని విద్యార్థులకు సూచించారు. తదుపరి ప్రభుత్వ పథకమైన భోజనం పథకంలో మెనూ ప్రకారం భోజనాన్ని విద్యార్థులకు విధిగా అందించాలని వారు హెడ్మాస్టర్ ను ఆదేశించారు. పాఠశాలలో పిల్లలను తమ పిల్లలగా చూసుకుంటూ చక్కటి ప్రేమతో పాటు చక్కటి విద్యను కూడా అందించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు