రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని లేఖ
రెండు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రికి కూడా లేఖ రాసిన రాహుల్ గాంధీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రాష్ట్రంలో యువత హత్యలను నిరోధించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని ఆ లేఖలో కోరారు. రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు.
డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని లేఖ రాశారు.