విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : 25న జరిగిన రాజాం బార్ అసోసియేషన్ ఎన్నికలు మెట్ట దామోదర్ రావు ఎన్నికల అధికారి అధ్యక్షతన ఏకగ్రీవంగా జరిగినవి. ఈ ఎన్నికలకు బార్ సభ్యులు అందరూ హాజరైనారు. బార్ అధ్యక్షులుగా మామిడి వేణుగోపాలనాయుడు , ఉపాధ్యక్షలుగా నక్క మురళీధర్రావు, జనరల్ సెక్రటరీగా అల్లిన సత్యన్నారాయణ , కోశాధికారిగా యందవ ఆశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీగా శ్రీమతి శాసపు జయలక్ష్మి, క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శిగా వంజరావు జితేంద్రకుమార్, బైబ్రరీరయన్ సెక్రటరీ బింగి కాశి మరియు కార్యవర్గ సభ్యులుగా రెడ్డి విజయ్కుమార్, శెట్టి పోలారావు, యర్రమిల్లి సత్యశ్రీనివాసరావు, కంచరాన రమణమూర్తి, ఇనుముల శ్రీరాములునాయుడు వీరికి పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.