విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : సీనియర్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాలవలస రాజశేఖర్ గత కొద్ది రోజుల క్రితం మృతి చెందారు.కావున వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పాలకొండ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను వైసీపీ రాజాం ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేశ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలికారు. రాజాం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితిని జగన్ కు వివరించారు. డాక్టర్ రాజేష్ వెంట జగన్ ను కలిసేందుకు పలువురు సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.