Saturday, April 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉగ్రవాద దాడిలో మృతులకు సంతాపం తెలుపుతూ ర్యాలీ..

ఉగ్రవాద దాడిలో మృతులకు సంతాపం తెలుపుతూ ర్యాలీ..

టిడిపి, జనసేన పార్టీ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో ఉగ్రదాడి ఘటనలో మృతులకు సంతాపం తెలియజేస్తూ పట్టణములో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని జనసేన పార్టీ నాయకులు, టిడిపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. తదుపరి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక్కం మధుసూదన్ రెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకుడు కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్, నాయకులు ఫణి కుమార్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలిని ఘటించారు. పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమైన చర్య అని ఈ ఘటన వల్ల భారతీయులందరూ తీవ్ర మనోవేదనకు గురి కావడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కారకులైన వారిని శిక్షించి గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు