Friday, April 4, 2025
Homeజిల్లాలుఅనకాపల్లిఅత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి

అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి

ఏపి మహిళా సమాఖ్య డిమాండ్‌
విశాలాంధ్ర – పరవాడ(అనకాపల్లి జిల్లా)బీ విశాఖలో న్యాయ విద్యార్ధిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఏపి మహిళా సమాఖ్య అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బూసి పరమేశ్వరి డిమాండ్‌ చేశారు. అత్యాచారానికి గురైన న్యాయ విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ ఏపి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం దేశపాత్రునిపాలెం అంబేద్కర్‌ విగ్రహం వద్ద మహిళలు నిరసన చేపట్టారు. బాధితులరాలికి సత్వర న్యాయం కోసం కేసును ప్రత్యెక కోర్టుకు బదలాయించాలని నినాదాలు చేసారు. ఈ సందర్భంగా పరమేశ్వరి మాట్లాడుతూ సమాజంలో ఆడ పిల్లలకు రక్షణ కొరవడిరదన్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో ఆడపిల్లలను వంచించే మృగాళ్లను శిక్షించడానికి నేడున్న నిర్భయ చట్టం చాలదన్నారు. ఇంకా కఠిన శిక్షలతో పటిష్టమైన చట్టాల అమలుకు ప్రత్యేక యంత్రాంగం అవసరం ఉందన్నారు. విద్యాసంస్థల్లో ఆడపిల్లల పట్ల సహచర విద్యార్థులు, పురుష సిబ్బంది ప్రవర్తన, నడవడికపై పోలిసు నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలో ఆడపిల్లల ఇబ్బందులు నిర్భయంగా చెప్పుకునేందుకు ఆత్మీయ స్పర్శ, నైపుణ్యం కలిగిన కౌన్సిలర్ల నియామకం తప్పనిసరి చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయ విద్యార్థిని అత్యాచార దోషులకు న్యాయవాదులెవరు బెయిల్‌ పిటిషన్‌ వేయరాదని పిటిషన్‌ వేసిన న్యాయవాదిని బార్‌ అసోసియేషన్‌ నుండి బహిష్కరించాలని న్యాయవాదులకు పరమేశ్వరి విజ్ఞప్తి చేశారు. కె.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కె.తులసి, బి.సుగుణ, కె.రమణమ్మ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు