Homeజిల్లాలుఅనంతపురంప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత

ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత

- Advertisement -

-తహశీల్దార్ ఎస్.బి.చెన్నకేశవులు

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తహశీల్దార్ ఎస్.బి.చెన్నకేశవులు తెలిపారు. మంగళవారం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో అయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారం, శాఖాపరమైన పురోగతి వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. గత 30 రోజుల్లో మండల ప్రజల నుంచి మొత్తం 26 అర్జీలు నమోదుకాగా అత్యధికంగా భూ సంబంధిత సమస్యలు, పట్టాదారు పాస్‌బుక్కులు, మ్యూటేషన్, సర్వే మరియు సర్టిఫికెట్లకు సంబంధించి 23 అర్జీలు రాగా, పింఛన్లు మరియు ఇతర సమస్యలపై మూడు అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ​ప్రస్తుతం ఈ అర్జీలపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్దేశిత గడువులోగా న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు