Wednesday, May 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఆర్డిఓ సమావేశం..

వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఆర్డిఓ సమావేశం..

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆర్డిఓ మహేష్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, ఇతర విషయాల గురించి చర్చించడం జరిగింది. అనంతరం ఓటర్ జాబితా విషయంలో పలు సలహాలను వివిధ రాజకీయ పార్టీ తరఫున ఆర్డీవో దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం ఆర్డిఓ మాట్లాడుతూ విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ ఈశ్వరయ్య, ఎన్నికల సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్లు, వివిధ రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు