విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని తారకరామాపురం క్రీడా మైదానంలో మే ఒకటవ తేదీ నుండి ఉచిత వేసవి క్రికెట్ శిబిరమును నిర్వహిస్తున్నట్లు కోచ్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్డిటి స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 18 సంవత్సరాల లోపు గల బాల బాలికలు అర్హులని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు సెల్ నెంబర్ 9985929285 కాల్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఆర్ డి టి ఉచిత క్రికెట్ వేసేవి శిబిరం. కోచ్ రాజశేఖర్
RELATED ARTICLES