Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాబ్ మేళా పోస్టర్లను విడుదల చేసిన ఆర్డీవో

జాబ్ మేళా పోస్టర్లను విడుదల చేసిన ఆర్డీవో

మున్సిపల్ కమిషనర్, ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బత్తలపల్లి రోడ్ సిఎన్బి కళ్యాణమండపంలో ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆర్డిఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం కల్పించే యోజన తో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం నిరుద్యోగులకు ఒక వరంలాగా మారిందని తెలిపారు. వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న యువతి యువకులు ఉద్యోగాల కోసం వివిధ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారని, అలాగాకుండా 90 కంపెనీలను నిరుద్యోగులు చెందకే తీసుకొచ్చి మెగా జాబ్ మేళాను మన మంత్రి నిర్వహించడం గర్వించదగ్గ విషయం అని తెలిపారు. పదవ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వారందరూ కూడా అర్హులేనని, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్ మేలో పాల్గొనాలని తెలిపారు. ఎంపికలో అయిన వారికి 50 వేల రూపాయల వరకు జీతం ఉంటుందని తెలిపారు. కావున అభ్యర్థులందరూ కూడా విద్యాహేత పత్రాలు జిరాక్స్, ఆధార్ కార్డు, రెండు ఫోటోలతో హాజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్యామ్ రావు,డోల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు