Wednesday, December 25, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఓబుల్ కొండ మృతిపై మంత్రి నియోజకవర్గ ఇంచార్జి హరీష్ బాబు, బీజేపీ నాయకుడు డోలు రాజా...

ఓబుల్ కొండ మృతిపై మంత్రి నియోజకవర్గ ఇంచార్జి హరీష్ బాబు, బీజేపీ నాయకుడు డోలు రాజా రెడ్డి స్పందన..

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని 27వ వార్డులో ఓబుల్ కొండ (60) మృతిచెందిన విషాదకరమైన సమాచారం తెలుసుకున్న మంత్రి నియోజకవర్గ ఇంచార్జి హరీష్ బాబు, మంత్రి కార్యాలయ సిబ్బంది, బీజేపీ నాయకుడు డోలు రాజా రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హరీష్ బాబు బాధిత కుటుంబాన్ని ఓబుల్ కొండ కుమారుడు వంశీ యొక్క ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వంశీకి మెరుగైన వైద్యం చికిత్సలు పొందేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని అందుకు మా సహాయ సహకారాలను తప్పక అందిస్తామని తెలిపారు. అలాగే హరీష్ బాబు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులతో మాట్లాడి, బాధిత కుటుంబానికి పూర్తి సహకారం అందించేందుకు ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా దృక్పథంతో డోలు రాజా రెడ్డి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు