Homeజిల్లాలుఅనంతపురంఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యూ ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యూ ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మండలంలోని ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యూ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపును రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంబంధిత పాఠశాలకు అవసరమైన ఎన్‌ఓసీ లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నప్పటికీ వారి భద్రత కోసం అదనపు సిబ్బందిని నియమించలేదని పేర్కొన్నారు. అలాగే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, సీసీ కెమెరాలు వంటి కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదన్నారు.తరగతి గదుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కూర్చోబెట్టి బోధన కొనసాగిస్తున్నారని, పుస్తకాలు, ఇతర పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యూ ప్రైవేట్ పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ తరఫున జిల్లా అధికారులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు