Monday, January 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమద్దతు ధరకు కందులు కొనుగోలు కొరకు నమోదు చేసుకోండి

మద్దతు ధరకు కందులు కొనుగోలు కొరకు నమోదు చేసుకోండి

వ్యవసాయ అధికారి ముస్తఫా
విశాలాంధ్ర ధర్మవరం:; మద్దతు ధరకు గాను కందులు కొనుగోలు కోసం రైతులు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని కునుతూరు, పోతుకుంట గ్రామాలలో పర్యటించి, రైతు సేవ కేంద్రాలలో కందుల నమోదు కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7,750 లేదా మార్కెట్ ధర ఏది ఎక్కువ అయితే ఆ ధరతో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కందులు కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. కావున రైతులకు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని తాము సూచించడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాసుబుక్కు, ఆధార్ లింక్ కలిగిన మొబైల్ నెంబర్ తీసుకొని రైతు సేవ కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు