Saturday, May 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాలుగవ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు..

నాలుగవ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు..

విశాలాంధ్ర ధర్మవరం;; 650-2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు మా పోరాటాలు ఆపము అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, ఏఐటియుసి, కార్మిక సంఘం, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షను నాలుగవ రోజు చేపట్టారు. ఈ దీక్షలను ప్రారంభించిన చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగమయ్య సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ రిలే దీక్షల కార్యక్రమానికి మద్దతు తెలపడానికి చేతి వృత్తుదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి , ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు నాగప్ప , చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ గారు, ఏఐఎస్బి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పోతులయ్య కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఏ ఐ టి యు సి, కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, మాట్లాడుతూ
ధర్మవరం పట్టణంలో గత రెండు నెలలుగా ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మికులు 650-2,సర్వేనెంబర్ లో వారికి జరిగిన అన్యాయం గురించి విచారణ చేపట్టాలని కార్మికులు చేస్తున్న ఉద్యమాల ను రెవిన్యూ అధికారులు నీరు కార్చే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. కార్మికులు రెవిన్యూ ఆఫీసుకు ఎప్పుడు వెళ్లినా వారికి సరైన సమాధానం చెప్పకుండా ఆర్డీవో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు అని తెలిపారు.నాలుగు రోజులుగా ప్లంబర్స్ ఎలక్ట్రిషన్స్ కార్మికులు రిలే దీక్షలు చేస్తున్న ఆర్టీవో ఎటువంటి స్పందన లేకుండా కార్మికులు సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరించడంలో అంతరాయం ఏమిటో అర్థం కావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకి, కబ్జాకోరులకి రెవిన్యూ అధికారులు అండగా ఉంటూ కార్మికులకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు అని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే కార్మికులను ప్రజాసంఘాల నాయకులను, మేధావులను, అఖిలపక్ష పార్టీ నాయకులను, అన్ని ప్రజాసంఘాలను కలుపుకొని కార్మికులకు న్యాయం జరిగేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అంతేకాకుండా కార్మికులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, మసూద్,రామకృష్ణ, రామసుబ్బయ్య, సురేంద్ర, నాగేంద్ర, చిన్న, జనార్ధన్, మరియు మహిళా సమాఖ్య నాయకులు, లలితమ్మ లింగమ్మ ఈరమ్మ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు