Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట

పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట

పోసానిపై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పోసానిపై సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పోసానిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.కేసులో అదనంగా 111 సెక్షన్ తో పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారంటూ సెక్షన్లు నమోదు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ విచారణ అధికారి మురళీకృష్ణపై సీరియస్ అయింది. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించింది. మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు