విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశాలపై కౌన్సిలర్లు అందరూ కూడా తమ ఆమోదమును తెలపడం జరిగిందని చైర్మన్ కాచర్ల లక్ష్మీ తెలిపారు. ఈ సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. అజెండాలోని అజెండాలోని 7.14 అంశాలలో 2016-17 సంవత్సరములు ఎన్ ఆర్ జి ఎఫ్ కింద చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి మంజూరు చేయాలని అజెండాలో ఉండడంతో కౌన్సిలర్ చందమూరి నారాయణరెడ్డి వ్యతిరేకించగా మిగిలిన కౌన్సిలర్లు కూడా అప్పట్లో చేసిన అభివృద్ధిలకు మున్సిపల్ నిధులలో ఎలా బిల్లులు మంజూరు చేస్తారని కమిషనర్ను ప్రశ్నించారు. దీంతో రెండు తీర్మానాలు చైర్పర్సన్ రిజెక్ట్ చేయడం జరిగింది అని ప్రకటించారు. అదేవిధంగా పట్టణంలోని మున్సిపల్ ట్యాంకులను శుభ్రం చేయడం లేదని, పర్యవేక్షణ పూర్తిగా లేదని, దీనివల్ల రోగాలు వచ్చే అవకాశము ఉన్నాయని పలువురు కౌన్సిలర్లు తెలియజేశారు. కేవలం రిజిస్టర్ లోనే శుభ్రం చేసినట్టు రాసుకుంటే సరిపోదని, అమలుపరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు తెలిపారు. స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ శుభ్రం చేసే సమయంలో కౌన్సిలర్లకు సమాచారం ఇస్తానని తెలిపారు. కదిరికేటి వద్ద ఫ్లైఓవర్ బీచ్ పనులు జరుగుతున్నాయని వన్వే ఉండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా ఇటీవలే ఒక విద్యార్థి కూడా మృతి చెందడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ పై సంబంధిత అధికారులతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిషనర్కి తెలిపారు. అదేవిధంగా పట్టణములో పలుచోట్ల వీధిలైట్లు కూడా లేకపోవడంతో చీకటి కమ్ముకున్నదని, ప్రజలు తీవ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీధిలైట్లు స్టాకు లేదని వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శంషాద్ బేగం, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ శామ్సన్, కేశవ, టిపిఓ విజయభాస్కర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అజెండా అంశాలపై ఆమోదం తెలిపిన కౌన్సిల్ తీర్మానాలు.. చైర్మన్
RELATED ARTICLES