విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా): గ్రామ సభలలో ప్రజలు చెప్పే సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే జేసీ. అస్మిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని ఊరుచింతల, తలారిచెరువు, సజ్జలదిన్నె గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జేసీ. అస్మిత్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే జేసీ. అస్మిత్ రెడ్డి గ్రామ సభలకు విచ్చేసిన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. ఉపాధి హామీ పనులు జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి పనులు కల్పించి కూలీలు వలసలు వెళ్ల కుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా గ్రామాలలో రోడ్లు, మురికి కాలవల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫజల్ భాష ఈఓఆర్డి వెంకటేష్ పంచాయతీరాజ్ ఏఈ సురేష్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ డిఈ రాంగోపాల్ రెడ్డి ఏఈ వీరప్రసాద్ రెడ్డి ఏవో, ఏపిఎం వీరస్వామి ప్రజలు పాల్గొన్నారు.