Thursday, May 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రత్యేక విద్యుత్ అదాలత్ కు స్పందన..

ప్రత్యేక విద్యుత్ అదాలత్ కు స్పందన..

పుట్టపర్తి ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివరాములు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బత్తలపల్లి రోడ్ మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ లో నిర్వహించిన ప్రత్యేక విద్యుత్ అదాలకు స్పందన రావడం జరిగిందని పుట్టపర్తి ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓ. శివరాములు తెలిపారు. ఈ సందర్భంగా శివ రాములు మాట్లాడుతూ ప్రత్యేక విద్యుత్ అదాలత్ కు రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు రామ్మోహన్రావు, సాంకేతిక సభ్యులు అంజనీ కుమార్, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి హాజరై వినియోగదారుల సమస్యల పరిష్కరించడంలో వారితో చర్చించి పరిష్కార మార్గమును చూపించడం జరిగింది అని తెలిపారు. మొత్తం 28 ఫిర్యాదులు రాగా, అందులో ఐదు ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 23 ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, తదుపరి సంబంధిత అధికారుల ద్వారా విచారణ చేయించి న్యాయ పరిష్కారం చేయబడునని తెలిపారు. ఈ ప్రత్యేక విద్యుత్ అదాల విద్యుత్ వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. కొన్ని విద్యుత్ సమస్యలు పరిష్కారం కానివి కూడా ఇక్కడ పరిష్కరించడం జరిగిందని వారు తెలిపారు. ఈ ప్రత్యేక విద్యుత్ అదాలతో ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని ధర్మవరం టౌన్ -1, టౌన్-2, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి సెక్షన్లకు సంబంధించినటువంటి విద్యుత్ సమస్యలను పరిష్కరించుటకు కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రత్యేక విద్యుత్ అదాల ఏర్పాటు పట్ల విద్యుత్ వినియోగదారులు కూడా సంబంధిత అధికారులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ అదాలత్ కార్యక్రమంలో ఏడిఈ- లక్ష్మీనరసింహారెడ్డి, ఏవో రామస్వామి, ఏ ఏ ఓ రామకృష్ణ, ఏఈలు నాగభూషణం, కొండారెడ్డి, జానకి రామయ్య, శివయ్య, రవి తో పాటు 50 మంది వినియోగదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు