న్యూదిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి చెందిన ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీట్ పేపర్ లీక్, రీ-టెస్ట్ సమయాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందనే కారణంతో ఆ పార్టీ ఎక్స్ ఖాతాపై నిషేధం విధించినట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. నీట్ పరీక్ష ఇప్పటికే ముగిసినందున…నిషేధం తొలగించాలని కోర్టు ఆదేశించింది. తమ పార్టీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక పొలిటికల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేశారని దీప్కే పిటిషన్లో తెలిపారు. నిలిపివేసే సమయానికి ఆ ఖాతాకు దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సీజేపీ పేరిట వెబ్సైట్ కూడా ప్రారంభించారు. కాగా విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఆ పార్టీ పని చేస్తోంది. నిరుద్యోగులపై సీజేఐ చేసిన వ్యాఖ్యలను వ్యంగ్యంగా పరిగణిస్తూ ‘వ్యంగ్య రాజకీయ ఉద్యమం’లా ఏర్పడింది. ఇటీవల నీట్ పేపర్ లీక్ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. సోషల్ మీడియాలో ఒక బలమైన యువజన వేదికగా సీజేపీ నేడు రూపాంతరం చెందింది.
సీజేపీ ‘ఎక్స్’ ఖాతాను పునరుద్ధరించండి: దిల్లీ హైకోర్టు
- Advertisement -
RELATED ARTICLES


