Thursday, February 20, 2025
Homeఆంధ్రప్రదేశ్రిటైర్డ్ టీచర్ నీరుకొండ నరసింహారావు మృతి..

రిటైర్డ్ టీచర్ నీరుకొండ నరసింహారావు మృతి..

విశాలాంధ్ర నందిగామ :- పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ నీరుకొండ నరసింహారావు సోమవారం ఉదయం మృతి చెందారు నీరుకొండ నరసింహారావు విశ్రాంత ఉపాధ్యాయులు మృతి చెందిన సంఘటన తెలుసుకొని పలువురు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు
ఎస్ టి యు యూనియన్ అభివృద్ధికి నిరంతర కృషిచేసి ఉపాధ్యాయులను ఏకత్రాటిపై నడిపి ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి,ఎస్ టి యు భవనం రావడానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు రిటైర్ అయిన అనంతరం-ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో కూడా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు ఉపాధ్యాయ హక్కుల కోసం ఉద్యమం చేసి పోరాడారు ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వీరు లేని లోటు ఉపాధ్యాయ ఉద్యమానికి,రిటైర్డ్ ఉద్యోగులకు తీరని లోటని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు