ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; ఉద్యోగములో పనిచేస్తూ మంచి గుర్తింపు కొరకు కృషి చేసినప్పుడే పదవి విరమణ పొందిన నాడు మంచి సార్థకతో పాటు అందరి మన్ననలు పొందగలగడం జరుగుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా డిపో కార్యాలయంలో ఐదు మంది ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన సందర్భంగా అభినందన సభను వారు ఏర్పాటు చేశారు. సభ అధ్యక్షుడుగా నాగార్జున రెడ్డి వ్యవహరించారు. ఈ అభినందన సభలో రిటైర్డ్ అయిన వారు కే. శ్రీరాములు టిఐ- 3, బి. నరసిములు డ్రైవర్, పి. పురుషోత్తం కండక్టర్, కే. దూలెప్ప కండక్టర్, గోవిందరాజులు డ్రైవర్ మొత్తం 5 మందికి ఈ అభినందన సభలో ఆర్టీసీ అధికారులతో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తోటి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని వారు ఉద్యోగంలో సేవలను గుర్తు చేస్తూ వారికి శుభాభినందనలు తెలిపారు. అనంతరం డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థకు ఆర్టీసీ ఉద్యోగులే కీలకపాత్ర వహించడం జరుగుతుందని, వారి కృషి వల్లే నేడు ఆర్టీసీ ఆదాయానికి కారణం అవుతున్నారని తెలిపారు. ఆర్టీసీ సంస్థను తల్లిలాగా భావించి, వృత్తిని దైవంలా కొలిచినప్పుడే ప్రతి ఒక్కరూ గుర్తింపబడుతారని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, అది తోటి వారికి ఇబ్బంది కలుగుతుందని వారు గుర్తు చేశారు. ఏదిఏమైనా ఈ ఐదు మంది ధర్మవరం ఆర్టీసీ డిపోకు ఆదాయాన్ని చేకూర్చడం జరిగిందని, అటువంటి వారిని నా ద్వారా ఈ కార్యక్రమానికి పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తానని వారు తెలిపారు. అనంతరం బంధుమిత్రులు, ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు, డిపో సిబ్బంది అందరూ కలిసి ఆ ఐదు మందిని ఘనంగా సత్కరించారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ తాము శక్తి వంతెన లేకుండా ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, మా విధులలో సహాయ సహకారాల అందించిన తోటి ఉద్యోగస్తులకు అధికారులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున రెడ్డి, ఎస్ టి ఐ పెద్దన్న, రీజినల్ నాయకులు శ్రీనివాసులు తోపాటు ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ ఎన్ యు నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగంలో పనిచేస్తూ మంచి గుర్తింపు పొందినప్పుడే పదవి విరమణకు సార్థకత ..
RELATED ARTICLES