Saturday, December 21, 2024
Homeతెలంగాణరేవంత్ అంద‌ర్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు.. కెటిఆర్

రేవంత్ అంద‌ర్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు.. కెటిఆర్

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుపై తాను భయపడటం లేదని బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇందులో పైసా అవినీతి కూడా జరగలేదని తెలిపారు. లీగల్ గా తాము ముందుకెళతామని అన్నారు. ఈ-కార్ రేసింగ్ పై మంత్రిగా తాను విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తీసుకున్నానని చెప్పారు. కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ, ఈ-కార్ రేసింగ్ లో అవినీతి జరగలేదని, ప్రొసిజర్ సరిగా లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా ముఖ్యమంత్రే అందరినీ పక్కదోవ పట్టిస్తున్నారా? అని ప్రశ్నించారు. సీఎంకు సమాచార లోపం ఉందని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్ తో విచారణ జరిపిస్తే అందులో ఉండే అధికారులు ప్రభుత్వం మాట వింటారని చెప్పారు. రేవంత్ కింద పని చేసే అధికారులతో న్యాయం జరగదని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు