Homeతెలంగాణరేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర‌ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. రాజకీయపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.గత ఎన్నికల ప్రచార సమయంలో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ ఆయనపై పరువు నష్టం దావా వేసింది. తొలుత ఈ కేసును తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయగా, విచారణ అనంతరం న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, రాజకీయ నాయకులు చేసే ఆరోపణలు, విమర్శలకు సంబంధించిన వివాదాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో ఉపశమనం లభించినట్లయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు