Tuesday, April 15, 2025
Homeతెలంగాణరూ. 10 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు: కేటీఆర్

రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు: కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కంచ గచ్చిబౌలిలో పర్యావరణ విధ్వంసాన్ని సృష్టించారని విమర్శించారు. ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని.. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాల్పడుతోందని… రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీకి చెందిన ఒక ఎంపీ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒక బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారని తెలిపారు. ఎఫ్ఆర్బీఎంను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని… ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ బ్రోకరేజ్ కంపెనీ తెలిపిందని అన్నారు. దీనికోసం సుప్రీంకోర్టు తీర్పులు, చట్టాలు, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు