Thursday, January 30, 2025
Homeజాతీయంరోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేలు.. కేంద్ర పథకం వివరాలు!

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేలు.. కేంద్ర పథకం వివరాలు!

రహదారులపై ప్రమాదాలు జరిగినపుడు బాధితులకు సాయం చేయడానికి చాలా మంది సంకోచిస్తుంటారు. బాధితులను కాపాడాలని చూస్తే పోలీసులు, కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, మంచికి పోతే చెడు ఎదురైందనే సామెతలా అవుతుందని వెనకాడుతుంటారు. అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేసి తమ బాధ్యత అంతేనని అనుకుంటారు. అంబులెన్స్ వచ్చే వరకూ చూస్తూ నిలబడతారే తప్ప దగ్గర్లోని ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకురారు. ఇలాంటి ఘటనలు తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే, ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తే కేసుల్లో ఇరుక్కునే ఇబ్బంది ఉండదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడితే రూ.25 వేల బహుమతి అందుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ాగుడ్ సమారిటన్ స్కీం తెచ్చిందని వివరించారు.

బహుమతి అందుకోవాలంటే..
క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లాక స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. ప్రమాద వివరాలు, బాధితులను కాపాడిన వారి వివరాలతో పోలీసులు అధికారిక లేఖ అందిస్తారు. ఈ లేఖకు ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా, ఆసుపత్రి ధ్రువీకరణ పత్రాలను జత చేసి మండల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. రవాణా, రెవెన్యూ, పోలీసు, జాతీయ రహదారుల సంస్థ, వైద్యశాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ సమారిటన్‌ గుర్తించి నగదు ప్రోత్సాహకానికి ఎంపిక చేస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు