Saturday, April 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే ఇవ్వాలి

ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే ఇవ్వాలి

ఏపియస్ ఆర్టీసి లో ఖాళీలు ఉన్న అన్నికేటగిరుల పోస్టులు బర్తికీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలి

ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి

పిఆర్శీ కమీషన్ ను వెంటనే నియమించాలి

రాష్ట్రఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదర రావు,జి.వి.నరసయ్యలు డిమాండ్
విశాలాంధ్ర -ధర్మవరం; ఏపియస్ ఆర్టీసి (పిటిడి) ఉద్యోగులకు గత ఆరేళ్లుగా పెండింగు పెట్టిన పదోన్నతలకు ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆర్టీసి లో పనిచేస్తున్న క్లాస్ 4 ఉద్యోగునుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు పదోన్నతలు కోసం ఎదురుచూస్తున్న సుమారు 3500 మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని ఏపిపిటిడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
శుక్రవారం దర్మవరం లోని యన్.జి.ఓ.హోమ్ లో జరిగిన శ్రీ సత్యసాయి జిల్లా ఆర్టీసి ప్లాయీస్ యూనియన్ జిల్లా కార్య వర్గసమావేశం జిల్లా అధ్యక్షులు కె.బి.నాగర్జున రెడ్ఢి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గోన్న రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ గత 12 ఎళ్లుగా ఆర్టీసి కారుణ్యనియామాకాలు తప్ప, ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్ తో ఒక్క ఉద్యోగం కూడా నియామకం జరగలేకపోవడం దారుణం అని తెలిపారు.దీంతో ప్రస్తుతం ఆర్టీసిలో సూమారు 11 వేలు పోస్టులు వరకు వివిధ కేటగిరులలో ఖాళీలు ఉన్నాయి అని,వీటన్నింటిని బర్తిచేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చి, రాష్త్రంలో ఉన్న బడుగు,బలహీన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పిఆర్శి అరియర్సు,డిఏ బకాయిలు తో పాటు పిఆర్సిని కమిషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.
ఈసమావేశంలో పాల్గోన్న మరో ముఖ్యఅతిధి ఇ.యు రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రస్తుతం ఇ.హెచ్.యస్ ద్వారా కనీస వైద్య సౌకర్యాలు కూడా అందడంలేదని. ఆర్టీసిలో పనిచేసే ఉద్యోగులు 24×7 పద్దతిలో పనిచేస్తారు
కాబట్టి విలీనానికి ముందు ఆర్టీసి ఉద్యోగులకు/రిటైర్డ్ ఉద్యోగులకు ఉన్న రిఫరల్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని తెలిపారు. ఉద్యోగులకు ఇ.హెచ్.యస్ ద్వారా సరైన వైద్య సౌకర్యాలు అందక సంవత్సరానికి సుమారుగా 350 మంది వరకు చనిపోతున్నందున పాతపద్దతిలో ఆర్టీసి ఉద్యోగులకు వైద్యసౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఇ.యు రాష్ట్రకార్యదర్శి సి.నభీరసూల్ మాట్లాడుతూ అభద్రతతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసి ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు కాలంలో 2019 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాదించుకున్న సర్కులర్. 01/2019 ను గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జిల్లాలలోని ఆర్టీసీ అధికారులు పక్కకు పెట్టారని వారు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) సదరు సర్కులర్ ను యధాతదంగా అమలు చేస్తామని హామీ ఇచ్చినా కూడా, అమలు చేయలేకపోవడం దారుణము కాదా అని ప్రశ్నించారు. క్రింది స్థాయిలోని అధికారులకు ఆదేశాలు ఇచ్చినా, ఇంకా కొంత మంది అధికారులు ఈ సర్కులర్ అమలు చేయడంలేదని ఇది సరైన విధానం కాదని వెంటనే ఉన్నతాధికారులు పాటించాలని డిమాండ్ చేసారు. అనంతరం కడప జోన్ ఇ.యు అధ్యక్షులు కె.కె.కుమార్,జోనల్ కార్యదర్శి యన్.రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్టీసిలో హయ్యర్ పెన్షన్ కొరకు సుప్రీమ్ కోర్టు ఆధేశాల మెరకు ఆర్టీసి యం.డి అవకాశం కల్పించినప్పటికీ ఈ.పి.ఎఫ్.ఓ, భర్కత్ పూర్ లో ఉన్న ప్రోవిడెంటు కమీషనర్ కార్యాలయంనుండి నిర్దాక్షనంగా తిరస్కరించి నందున సుమారు 8 వేలమందికి హయ్యర్ పెన్సన్ రాకుండా పోతుందని వారు తెలిపారు. వీరందరికీ న్యా యం చేసేందుకు ఎంప్లాయీస్ యూనియన్ గా కృషిచేస్తున్నామని తెలిపారు.రాష్ట్రకార్యదర్శి సి.నభీరసూల్ మాట్లాడుతూ కడప జోన్ లో ఉద్యోగులకు పనిచేస్తున్న ఏడి/పిడి/యస్.పి.డి/యం.ఇ.డి విభాగాలలో పనిచేస్తున్న క్లరికల్ సిబ్బంది కొత్త కంప్యూటర్, ప్రింటర్,పనిచేసే ప్రదేశాలలో సిబ్బందికి అవసరమైన పర్నిచర్ ను కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.బి.నాగర్జునరెడ్డి, జి.వై.పి.రావు లు మాట్లాడుచూ జిల్లలో డ్రైవర్, కండక్టర్ల గ్యారేజ్ లలో మెయింటెనెన్స్ సిబ్బంది కొరత ఎక్కువగా వున్నదని, జిల్లా లోని అన్ని డిపోలలోని షార్టేజ్ ని సరిచేయుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ నాయకులు యన్.సి.శేఖర్, హెచ్.అరుణమ్మ, జిల్లా నాయకులు యన్.నారాయణస్వామి, ఆర్.యస్.రెడ్డి, ఏ.వి.వి.ప్రసాద్, పి.రమణప్ప, కె.యస్.వాసులు, బి.నరసింహులు, సుమో శ్రీను, 6 డిపోలట్రాఫిక్, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు