Wednesday, April 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్టీసీ ప్రయాణికులకు చలివేంద్రం ఏర్పాటు..

ఆర్టీసీ ప్రయాణికులకు చలివేంద్రం ఏర్పాటు..

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల కొరకు యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రమును ఏర్పాటు చేయడం జరిగిందని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వంకదారి మోహన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిపో మేనేజర్ సత్యనారాయణ హాజరు కావడం జరిగింది. అనంతరం డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ సంస్థ ఎన్నో వివిధ కార్యక్రమాలను, వివిధ సేవలను గ్రామీణ పట్టణ ప్రాంతాలకు అందించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ముఖ్యంగా ఆర్టీసీ ప్రయాణికులకు ఫిల్టర్ వాటర్ ను అందించడం ప్రయాణికులకు ఒక వరంలాగా మారిందని తెలిపారు. తదుపరి డిపో మేనేజర్ ప్రయాణికులు, అధికారులు, సిబ్బంది తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ సుబ్బారావు, చాంద్ బాషా, గర్రె రమేష్ బాబు, సత్రశాల మల్లికార్జున, ఓ వి ప్రసాద్, నామాల శీన, సికిందర్, కౌన్సిలర్ కేత లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు