విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామం వద్ద ఉన్న రూపా రాజా పీసీఎంఆర్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉషశ్రీ రాష్ట్రస్థాయి వేదిక్ మాథ్స్ పోటీలలో ప్రతిభ కనబరచడం జరిగిందని రూపా రాజా పీసిఎంఆర్ పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు వివిధ పోటీ పరీక్షలు కూడా నిర్వహిస్తూ విద్యార్థులకు మెరుగైన నైపుణ్యమును, జ్ఞానమును ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. విశ్వం ఎడిటేక్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన స్టార్ జూనియర్ లెవెల్ 3 రాష్ట్రస్థాయి వేదిక్ మాథ్స్ పోటీలలో పాల్గొని తృతీయ స్థానం పొందడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంక నువ్వు మ్యాచ్లో మున్ముందు మంచి ప్రతిభ కనబరచాలని వారు తమ ఆశీస్సులను అందజేశారు. తదుపరి చైర్మన్ హర్షవర్ధన్ తో పాటు డైరెక్టర్లు రూపా రాధాకృష్ణ, జగదీష్, కర్రీస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలును ప్రతిభ కనబరిచిన ఉషశ్రీ కు తెలియజేశారు.
రాష్ట్రస్థాయి వేదిక్ మాథ్స్ పోటీలలో రూపా రాజా బీసీ ఎంఆర్ పాఠశాల విద్యార్థిని ప్రతిభ
RELATED ARTICLES